Roopa Reddy Murder Protest
అకేరు న్యూస్ హన్మకొండ: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యను ఖండిస్తూ హన్మకొండలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వాడాఫ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అదాలత్ సెంటర్ నుంచి హన్మకొండ కలెక్టర్ కార్యాలయం వరకు ఉపాధ్యాయులు ర్యాలీగా తరలివెళ్లారు. రూపారెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని, పాఠశాలల్లో ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలని నినదించారు. ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
చెడు అలవాట్లను మందలించారనే కోపంతో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు రూపారెడ్డిపై దాడికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైన నేపథ్యంలో, ఈ ఘటనపై ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
రూపారెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, పాఠశాలల్లో ఉపాధ్యాయులు నిర్భయంగా విధులు నిర్వహించేలా భద్రతా చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. ఘటనకు బాధ్యులైన నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని కోరాయి.
ఉపాధ్యాయులపై దాడులు, బెదిరింపులు పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పాఠశాలల్లో ఉపాధ్యాయుల రక్షణకు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
