CKM College Guest Faculty Jobs
అకేరు న్యూస్ వరంగల్: సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకులుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి. పోశయ్య తెలిపారు.
కళాశాలలో బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్‌లో ఒకటి, బీకాం హెచ్ఆర్ ఆపరేషన్స్‌లో ఒకటి చొప్పున మొత్తం రెండు అతిథి అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఓసీ, బీసీ అభ్యర్థులు ఎం.కామ్‌లో 55 శాతం మార్కులతో, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. ఎంపిక ప్రక్రియలో పీహెచ్డీ, నెట్, సెట్ అర్హతలతో పాటు బోధనా అనుభవం ఉన్న అభ్యర్థులకు తొలి ప్రాధాన్యం ఉంటుందని వివరించారు.
అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 24వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా నేరుగా సీకేఎం కళాశాలలో అందజేయాలని ప్రిన్సిపల్ సూచించారు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హత కలిగిన అభ్యర్థులకు సమాచారం అందించి ఎంపిక ప్రక్రియ చేపడతామని తెలిపారు.
పూర్తి వివరాల కోసం సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను సంప్రదించాలని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి. పోశయ్య సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
