Station Ghanpur Bonalu Bullock Cart Festival
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధి చాగల్ లో ఆదివారం రాత్రి జరిగిన బోనాల పండుగలో ‘ఎడ్లబండ్ల’ ప్రదర్శన కు పూర్వ వైభవం వచ్చింది. డప్పుల మోతలు, శివశక్తుల పూనకాలు, ప్రజల కేరింతలతో జరిగిన పోచమ్మ బోనాల పండుగ కనుల పండువగా, వైభవంగా జరిగింది. బోనాల పండుగ సందర్భంగా వీధులన్నీ ప్రజలతో కిక్కిరిసిపోగా అలంకరించిన ఎడ్ల బండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బండ్లను చూసేందుకు వచ్చిన ప్రజలు చప్పట్లు, విజిల్స్, కరతాళ ధ్వనులతో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు.
* “ఎడ్లబండ్లకు బహుమతులు”
బోనాల పండుగ సందర్భంగా వివిధ ఆకారాలతో అలంకరించుకున్న ఎడ్ల బండ్ల ప్రదర్శన గ్రామస్తులు ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సందర్భంగా ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించిన రైతులకు 7, 9వ కౌన్సిలర్లు అన్నెపు సుమలత కుమార్, సౌధారపల్లి సంపత్ రాజ్ తో పాటు నాగ బండి సురేష్,
చాతరబోయిన మల్లేష్, కూన రాజు,
కనకం అశోక్, ఎదునూరి శ్రీకాంత్,
చాతరాబోయిన శంకర్, మాదారపు ప్రతాప్, గాండ్ల చిరంజీవి,
సోన్నాయిల సునీల్ ప్రత్యేక బహుమతులు అందించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
