Ravi Teja Irumudi Success Meet
* చెన్నై సక్సెస్ మీట్ లో నటుడు రవితేజ
ఆకేరు న్యూస్, హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ‘ఇరుముడి’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను అందుకుంటోంది. చిత్ర బృందం చెన్నైలో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించింది. రవితేజ, ప్రియ భవానీ శంకర్, దర్శకుడు శివ నిర్వాణ, సంగీత దర్శకుడు జి.వి. ప్రకాశ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
* చెన్నైతో అనుబంధం
చెన్నైతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని సినీ నటుడు రవితేజ గుర్తుచేసుకున్నారు. తన సినీ ప్రయాణం 1990ల మధ్యలో చెన్నై నుంచే ప్రారంభమైందన్నారు. తన కెరీర్ తొలినాళ్ల జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తమిళ ప్రేక్షకులు, తమిళ భాషపై తనకున్న అభిమానాన్ని కూడా వెల్లడించారు. తమిళంలో మాట్లాడేందుకు రవితేజ చేసిన ప్రయత్నం ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చెన్నైలో తనకు లభించిన ఆదరణను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ‘ఇరుముడి’కి తమిళ ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని పేర్కొన్నారు. క్లైమాక్స్ ఎంతో నచ్చిందని తెలిపారు. ప్రియ భవానీ శంకర్ నటనను ప్రశంసించారు. క్లైమాక్స్ సీన్ మనసును హత్తుకుందని, చిన్నారులకు కూడా భావోద్వేగానికి లోనయ్యారని తెలిపారు.
* సామాజిక సందేశం
ఆగస్టు 21న విడుదలైన ‘ఇరుముడి’కి తొలి రోజుల్లోనే ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభించింది. యాక్షన్తో పాటు భావోద్వేగ అంశాలు, తండ్రీకూతుళ్ల బంధం, సామాజిక సందేశం ప్రేక్షకులను మెప్పించింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
