Chittukurinji Tamil Movie
* 1.5 మిలియన్ల వ్యూస్ దాటిన ‘కురింజి మల మేళా’..
* విడుదలకు సిద్ధమైన తమిళ చిత్రం ‘చిట్టుకురింజి’
ఆకేరు న్యూస్, డెస్క్: తమిళంలో రొమాన్స్, కామెడీ, ఫాంటసీల వినూత్న కలయికతో తెరకెక్కుతున్న ఫీల్-గుడ్ చిత్రం ‘చిట్టుకురింజి’. ‘బ్లాక్ అండ్ వైట్ మీడియా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ బ్యానర్‌పై డి. జూడ్ అనంత నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజె మీనాక్షి సుందరం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన తొలి సింగిల్ ‘కురింజి మల మేళా’ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది.
* పాటను అత్యంత ఆకట్టుకునేలా..
ఎంతో ఉత్సాహభరితంగా సాగే ఈ పెళ్లి పాటను ప్రముఖ నటి, గాయని రమ్య నంబీసన్ ఆలపించగా, కు. కార్తీక్ సాహిత్యాన్ని అందించారు. సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్న మారా ఈ పాటను అత్యంత ఆకట్టుకునేలా స్వరపరిచారు. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో 1.5 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుని ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. తాజాగా ఈ చిత్రం డబ్బింగ్ పనులను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయని, త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని చిత్ర బృందం తెలిపింది.
* 1983 కాలం నాటి వైభవం.. 80 ఎకరాల్లో భారీ సెట్..
ఈ చిత్రంలో రజిత్ మీనన్ కథానాయకుడిగా నటించగా, దీప్షిక, నక్షా శరణ్, విజె పప్పు, జి.ఎమ్. కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. శ్రీరామ్ కార్తీక్ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపిస్తారు.
* చిత్రంలో ప్రధాన ఆకర్షణ..
ఇందుకోసం చిత్ర బృందం కొడైకనాల్‌లోని పళంగి కొండల్లో దాదాపు 80 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ గ్రామాన్ని నిర్మించింది. అంతేకాకుండా, అంతర్జాతీయ స్థాయి అనుభూతిని అందించడం కోసం హంగేరిలోని ప్రసిద్ధ ‘బుడాపెస్ట్ స్కోరింగ్ కంపెనీ’ స్టూడియోలో అంతర్జాతీయ సంగీతకారుల నేతృత్వంలో లైవ్ ఆర్కెస్ట్రాతో నేపథ్య సంగీతాన్ని (BGM) రికార్డ్ చేయడం విశేషం.
ఈ చిత్రానికి ఫ్రాన్సిస్ రాజ్‌కుమార్ ఎ. సినిమాటోగ్రఫీ అందించగా, మహేంద్రన్ గణేశన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. రామ్‌జీ ఆర్ట్ డైరెక్టర్‌గా, ధీనా కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ప్రేక్షకాదరణ పొందుతున్న ఈ వినూత్న ప్రేమకథ త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

