Road Safety Awareness Telangana
ఆకేరు న్యూస్,తొర్రూరు:
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, వాహన డ్రైవర్లు మరియు పశువుల యజమానులు తగిన జాగ్రత్తలు పాటించాలని మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీఓ) శంకర్ నాయక్ పిలుపునిచ్చారు.
సోమవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో రోడ్డు భద్రతపై విసృతంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీటీఓ శంకర్ నాయక్ మాట్లాడుతూ పాయింట్ల వారీగా పలు కీలక సూచనలు చేశారు
* స్కూల్ బస్సుల భద్రత
విద్యార్థుల భద్రతే ప్రథమ కర్తవ్యం. ప్రైవేట్ పాఠశాలల బస్సులు తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అనుభవజ్ఞులైన డ్రైవర్లను మాత్రమే నియమించుకోవాలి. బస్సుల్లో వేగ పరిమితి (స్పీడ్ గవర్నర్లు), ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచాలి.
* డ్రైవర్ల బాధ్యత
డ్రైవర్లు మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపరాదు. డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్ మాట్లాడటం అత్యంత ప్రమాదకరం. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకోకూడదు.
* పశువుల యజమానులకు హెచ్చరిక
ప్రధాన రహదారులపై పశువులను స్వేచ్ఛగా వదిలేయడం వల్ల రాత్రి వేళల్లో అనేక రవాణా ప్రమాదాలు జరుగుతున్నాయి. యజమానులు పశువులను రహదారులపైకి రాకుండా చూసుకోవాలని, నియమాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను జీవనశైలిలో భాగం చేసుకున్నప్పుడే ప్రమాద రహిత సమాజం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక రవాణా శాఖ అధికారులు, ప్రైవేటు పాఠశాలల యజమానులు, డ్రైవర్లు మరియు పశువుల యజమానులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
