Hanamkonda Woman Murder Case
అకేరు న్యూస్ హన్మకొండ ఎల్కతుర్తి: కారు డిక్కీలో మహిళ మృతదేహం లభ్యమైన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గోదావరిఖనికి చెందిన అంకతి మానస హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న వినోద్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా కీలక వివరాలు బయటపడ్డాయని కాజీపేట ఏసీపీ పింగళి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.
ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ వెనుక గుర్తుతెలియని వ్యక్తులు ఓ కారును వదిలివెళ్లారు. శుక్రవారం ఉదయం కారు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గ్రామ కార్యదర్శికి సమాచారం అందించారు. గ్రామ కార్యదర్శి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కారు ఎవరు అక్కడ పెట్టారనే కోణంలో విచారణ జరిపిన పోలీసులు.. వినోద్‌కుమార్ కారును అక్కడ ఉంచినట్లు గుర్తించారు.
కారులో లభించిన మృతదేహం గోదావరిఖనికి చెందిన అంకతి మానసదిగా నిర్ధారించారు.
మానస, వినోద్‌కుమార్‌లకు చిన్నప్పటి నుంచే పరిచయం ఉందని, ఇద్దరూ సింగరేణి కుటుంబాలకు చెందిన వారని ఏసీపీ తెలిపారు. మానస వివాహం విషయంలో కుటుంబంలో ఒత్తిళ్లు ఉన్నట్లు విచారణలో వెల్లడైందన్నారు.
మానసను హతమార్చాలని ఆమె తండ్రి వినోద్‌కుమార్‌ను కోరినట్లు విచారణలో వెల్లడైందని ఏసీపీ తెలిపారు.
అరుణాచలం వెళ్లేందుకు ప్లాన్ చేసిన క్రమంలో కరీంనగర్‌లోని వినోద్‌కుమార్ అద్దె ఇంట్లో మానసను హత్య చేసినట్లు నిందితుడు వెల్లడించాడని చెప్పారు.
పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు నిందితుడు తారసపడటంతో అదుపులోకి తీసుకుని విచారించగా ఈ హత్యకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని ఏసీపీ వివరించారు.
నిందితుడిని సోమవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులకు బదిలీ చేయనున్నట్లు ఏసీపీ పింగళి ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
