NEET PG 2026 Exam Hanamkonda
అకేరు న్యూస్ హనుమకొండ: ఈ నెల 30న నిర్వహించనున్న NEET (PG)-2026 పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి అధికారులను ఆదేశించారు.
సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో NEET (PG)-2026 పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. NTA ఆధ్వర్యంలో NEET (PG)-2026 కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఈ నెల 30న ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. హనుమకొండ జిల్లాలో నోబెల్ టెక్నాలజీ అండ్ సొల్యూషన్స్ (తిరుమల్ రెడ్డి కన్వెన్షన్ హాల్ ఎదురుగా, హైవే పక్కన, హసన్పర్తి), మోక్షిత్ కంప్యూటర్స్ (పొద్దుటూరు గార్డెన్స్, రామారం, కరీంనగర్ రోడ్డు), అయాన్ డిజిటల్ జోన్ (ఫిల్టర్ బెడ్, వడ్డేపల్లి) కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
పరీక్ష నిర్వహణ కోసం ముగ్గురు అధికారులను పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లుగా, ఒకరిని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిగా, ముగ్గురిని సిట్టింగ్ స్క్వాడ్ అధికారులుగా నియమించినట్లు తెలిపారు.
పరీక్ష కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు అరగంట ముందుగానే చేరుకోవాలని, ఉదయం 8:30 గంటల తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు.
పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్ష సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన వైద్య సదుపాయాలను కూడా అందుబాటులో ఉంచాలని, పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సమావేశంలో డీసీపీ దార కవిత, డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య, ఆర్టీసీ డీఎం ధరమ్ సింగ్, కలెక్టరేట్ పరిపాలనాధికారి గౌరీ శంకర్, ఎన్పీడీసీఎల్ ఏఈ అలేఖ్య, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాజు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ అధికారులు, ఆయా పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
