Secunderabad Cantonment Development
* రూ. 10 కోట్లతో అభివృద్ధి పనులు
* పాలకమండలి సమావేశంలో టెండర్లకు గ్రీన్‌సిగ్నల్
ఆకేరున్యూస్, హైదరాబాద్ :
సుదీర్ఘకాలం అనంతరం సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని కొన్ని సమస్యలకు మోక్షం లభించనుంది. బ్రిగేడియర్ ఎస్.రాజీవ్ అధ్యక్షతన సోమవారం జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ. 10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పాలకమండలి సమావేశంలో టెండర్లకు గ్రీన్‌సిగ్నల్ లభించింది.
* 8 వార్డుల్లో మౌలిక వసతులు
కంటోన్మెంట్ పరిధిలోని మొత్తం 8 వార్డుల్లో మంచినీరు, మురుగునీరు, రోడ్లు, పార్కులు, ఫుట్‌పాత్‌ల నిర్మాణం తదితర పనులు చేపట్టడానికి ఆహ్వానించిన టెండర్లను కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి ఆమోదించింది. దీంతో 10 కోట్ల రూపాయిల వ్యయంతో ఆయా కాలనీలు, బస్తీల్లో అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి. కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి సమావేశంలో స్థానిక శాసనసభ్యుడు ఎన్.శ్రీగణేష్, నామినేటెడ్ సభ్యురాలు బాణుక నర్మదమల్లిఖార్జున్, సీఈఓ అర్వింద్‌కుమార్ ద్విెేదీ తదితర అధికారులు పాల్గొన్నారు. ఆయా అభివృద్ధి పనులకు సంబంధించిన ఆహ్వానించిన టెండర్లను ఓకే చేశారు.
* పరిహారంగా మరో రూ.35 కోట్లు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ రహదారుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ల కోసం అప్పగించిన భూములకు పరిహారంగా మరో 35 కోట్ల రూపాయిలను తెలంగాణ ప్రభుత్వం చెల్లించనుంది. కంటోన్మెంట్‌కు చెందిన భూములను కేటాయించినందుకుగాను గతంలో 303 కోట్ల రూపాయిలు చెల్లించింది. ఈ మొత్తంతోకంటోన్మెంట్లో మురుగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి, హస్మత్‌పేట్, పికెట్ నాలాల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. కాగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరో 35 కోట్ల చెల్లించనుంది.
* ఎంపీ నిధులు
కంటోన్మెంట్ పరిధిలోని వార్డుల్లో మంచినీరు, మురుగునీరు, అధ్వాన రోడ్లు, వీధి దీపాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం తదితర పనులు చేపట్టాలని నామినేటెడ్ సభ్యురాలు బాణుక నర్మద కోరారు. అలాగే స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ కేటాయించిన 20 కోట్ల రూపాయిల నిధులతో తక్షణమే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
