Nirmal ACB Trap
* నిర్మల్‌లో ఏసీబీ ట్రాప్.. రూ.50 వేల లంచం తీసుకుంటూ ఇద్దరు ట్యాక్స్ అధికారులు అరెస్ట్
అకేరు న్యూస్ నిర్మల్ : నిర్మల్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చేపట్టిన ట్రాప్‌లో ఇద్దరు ట్యాక్స్ అధికారులు చిక్కుకున్నారు. అనుకూలమైన జీఎస్టీ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేందుకు వ్యాపారి నుంచి రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు.
స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ కొప్పెల గదావరి, సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయి కృష్ణ లంచం తీసుకుంటున్న సమయంలో తెలంగాణ ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు వెల్లడించారు.
ఇద్దరు అధికారులు లంచం మొత్తాన్ని స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరినీ అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టినట్లు ఏసీబీ వెల్లడించింది.
జీఎస్టీ ఆడిట్ రిపోర్ట్ విషయంలో లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ట్రాప్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. రూ.50 వేల లంచం.. ఏసీబీ వలలో ఇద్దరు ట్యాక్స్ అధికారులు.. ఘటన నిర్మల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
