CM Revanth Reddy Reacts on Kodad bus accident
* అధికారులకు కీలక ఆదేశాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: కోదాడ సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరు, దానికిగల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
ఇక ఈ ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలని సంబంధిత అధికారులను, వైద్య సిబ్బందిని ఆదేశించారు. బాధితులకు ఎలాంటి లోటు రాకుండా అవసరమైన అన్ని సహాయక చర్యలు చేపట్టాలని స్థానిక యంత్రాంగాన్ని ఆదేశించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
