Telangana students killed in Florida accident
* కారు చెట్టును ఢీ కొట్టడంతో మృతి
ఆకేరు న్యూస్, డెస్క్ : అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణలో విషాదం నింపింది. ఈ రాష్ట్రానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఆ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. వారు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలిసింది.
* సజీవదహనం
ఫ్లోరిడాలోని బ్రెవార్డ్ కౌంటీ సమీపంలో గల ఇంటర్‌స్టేట్ 95 (I-95) రహదారిపై ముగ్గురు యువకులు కారులో ప్రయాణిస్తున్నారు. వేగానికి ఆ కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న ఒక చెట్టును బలంగా ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పూర్తిగా తగలబడిపోవడంతో ముగ్గురు యువకులు కారులోనే ప్రాణాలు వదిలినట్లు తెలిసింది. ఉన్నత చదువుల కోసం వెళ్లి మృత్యువాత పడడం తీవ్ర విషాదాన్ని నింపింది.
* నిజామాబాద్జిల్లా యువకుడు..
ఆ యువకులు కేవలం మూడు నెలల క్రితమే ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లినట్లు సమాచారం. మృతుల్లో ఒకరిని నిజామాబాద్ జిల్లా, నవీపేట మండలానికి చెందిన రాహుల్ గా అధికారులు గుర్తించారు. మిగిలిన ఇద్దరు యువకులు కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినవారేనని సమాచారం ఉన్నప్పటికీ, వారి పూర్తి వివరాలు తెలియలేదు. ఫ్లోరిడాలో ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఏ వాహనంలో వారు ప్రయాణిస్తున్నారు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు ఏమిటనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఫ్లోరిడా హైవే పెట్రోల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* స్వస్థలాల్లో విషాదం
కేవలం మూడు నెలల క్రితమే అమెరికా వెళ్లిన యువకుడు ఇలా అనూహ్యంగా మృత్యువాత పడటంతో రాహుల్ స్వగ్రామం నవీపేటతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఫ్లోరిడా అధికారులు ప్రమాద సమాచారాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. మృతదేహాలను తిరిగి స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
