Kriti Sanon Rakhi Ad Controversy
* కృతి సనన్ వివాదాస్పద రాఖీ యాడ్ ఉపసహంకరణ
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన ఓ రాఖీ ప్రకటనపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో ప్రముఖ జువెలరీ బ్రాండ్ గివా ఆ ప్రకటనను ఉపసంహరించుకుంది. రక్షాబంధన్ సందర్భంగా బహుమతులు అందించే అంశంతో రూపొందించిన ఈ ప్రకటనలో కృతి ధరించిన దుస్తులపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె దుస్తులు ‘భారతీయ సంస్కృతికి విరుద్ధంగా ఉన్నాయి’ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తన దుస్తులను సమర్థిస్తూ కృతి సనన్ కూడా స్పందించారు.
* గివా వివరణ
బుధవారం తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో గివా ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలంటే తమకు ఎంతో గౌరవం, అభిమానం ఉన్నాయని తెలిపింది.“భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల పట్ల మాకు అత్యంత గౌరవం ఉంది. కుటుంబ సభ్యులందరితో కలిసి ఆనందకరమైన సందర్భాలను జరుపుకోవాలని మా బ్రాండ్ ఎప్పుడూ విశ్వసిస్తుంది. ఈసారి ఆ ప్రేమ, ఆనందాన్ని మన పెంపుడు జంతువులతోనూ పంచుకోవాలని అనుకున్నాం. అయితే మా తాజా ప్రకటన వల్ల సమాజంలోని కొన్ని వర్గాల మనోభావాలు అనుకోకుండా దెబ్బతిని ఉంటే, అది మా ఉద్దేశం మాత్రం కాదు” అని పేర్కొంది.
* ఉపసంహరించుకున్నాం
“అందరి మనోభావాలను గౌరవిస్తూ, సదరు ప్రకటనను అన్ని మాధ్యమాల నుంచి ఉపసంహరించుకున్నాం. ఈ పండుగ సీజన్లో మీ అందరికీ ప్రేమ, సానుకూలత కలగాలని కోరుకుంటున్నాం” అని తెలిపింది. కాగా, తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఈ పోస్ట్‌కు కామెంట్లను నిలిపివేసింది.
* అసలు వివాదం ఏంటి?
ఈ ప్రకటన జూలై 20న విడుదలైంది. అప్పటి నుంచి దీనిపై సోషల్ మీడియాలో పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. “బికినీలో ఉండి సోదరుడికి ఎవరు రాఖీ కడతారు?” అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించగా, మరికొందరు ఈ ప్రకటన హిందూ సంప్రదాయాలను ఎగతాళి చేసేలా ఉందని విమర్శించారు. ఈ వివాదంపై నటి, ఎంపీ కంగనా రనౌత్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. కృతి సనన్ పేరును నేరుగా ప్రస్తావించకుండానే ఆమె ప్రకటనపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు.
* కృతి సనన్ ఏమన్నారు?
అయితే ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తిన తర్వాత కృతి సనన్ ట్రోలర్లకు గట్టిగానే సమాధానం ఇచ్చారు. పండుగల సారాంశం మనం ధరించే దుస్తుల్లో ఉండదని, వాటి వెనుక ఉన్న భావోద్వేగాలు, సంప్రదాయాల అర్థంలో ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
