Bojja Jayaraj ,Mining ADE
* రాష్ట్రవ్యాప్తంగా 12 చోట్ల తనిఖీలు
ఆకేరు న్యూస్ , భూపాలపల్లి:
ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి( Bhupal pally ) జిల్లా మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ (ADE) బొజ్జ జయరాజ్ (Bojja Jayaraj ) నివాసాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. భూపాలపల్లి జిల్లా కేంద్రంతో పాటు హైదరాబాద్లోని బోడుప్పల్లో ఉన్న జయరాజ్ నివాసాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు.భూపాలపల్లి ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా చేసే అక్రమార్కులతో జయరాజ్ చేతులు కలిపారనే గట్టి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన కూడబెట్టిన అక్రమ ఆస్తులపై ఏసీబీకి పక్కా సమాచారం అందినట్లు తెలుస్తోంది.
కేవలం భూపాలపల్లి, హైదరాబాద్లోనే కాకుండా సూర్యాపేట, తాండూరు సహా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు ముమ్మరం చేశారు. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.
—————————-

Please tell us what is wrong. Your report will be sent to the website team.
