Nalimele Eliya SC Cell Vice Chairman
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ గా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండకి చెందిన నలిమెల ఏలీయను నియమించినట్లు రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రకటించారు. ఈ సందర్భంగా ఏలీయా మాట్లాడుతూ ఎస్సీల సమ స్యలు ఎప్పటికప్పుడు రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా నని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి అందిస్తున్న పనితీరును ప్రజలకు చేరవేస్తానని అన్నారు. అనునిత్యం పార్టీకి కట్టుబడి ఉంటానని తన మీద నమ్మకంతో తనకు పదవి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుగుల రేవం త్ రెడ్డి, టిపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారా యణ, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, స్థానిక, ఎమ్మెల్యే కడియం శ్రీహరికి, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశ్వినీరెడ్డి, కొమ్మూరి ప్రతాపరెడ్డికి, కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షురాలు లకవత్ ధన్వంతికి, జిల్లా ఎస్సీ సెల్ ఛైర్మెన్ వేముల మల్లేశంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
