Harish Rao on GO 97
* వారి గొంతు పిసుకుతారా ?
* ఇది ప్రజా పాలన కాదు.. రాక్షస, తుగ్లక్ పాలన
* స్కిల్ యూనివర్సిటీ పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం
* జీవో 97 రద్దు చేయాలి..
* మమ్మల్ని అరెస్ట్ చేస్తే విద్యార్థుల సమస్యలు తీరుతాయా ?
* ఢిల్లీకో నీతి, తెలంగాణకో నీతా ?.. రాహుల్ గాంధీ ఇక్కడికొచ్చి ఎందుకు పోరాడరు ?
* మెస్ బంద్ చేసి, కాలేజీకి తాళాలు వేస్తారా ?
* బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు
ఆకేరు న్యూస్, వరంగల్ :
పిల్లల గొంతులు పిసుకుతారా ?.. పాలిటెక్నిక్ విద్యార్థులేమైనా టెర్రరిస్టులా? .. స్కిల్ యూనివర్సిటీ పేరుతో లక్ష మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతారా అని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ అగ్రనేత హరీష్‌రావు మండి పడ్డారు. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ధర్నాకు మద్దతు తెలపడానికి వెళ్తున్న క్రమంలో పోలీసులు తనను అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించడం పట్ల హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల గొంతు నొక్కేలా వ్యవహరిస్తున్న పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి అత్యంత కర్కశంగా పాలిటెక్నిక్ విద్యార్థుల గొంతులు పిసుకుతున్నారన్నారు. అక్రమంగా కేసులు బనాయించి, భౌతిక దాడులకు పాల్పడుతున్నారన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులేమైనా టెర్రరిస్టులా? లేక సంఘ విద్రోహ శక్తులా ? అని ప్రశ్నించారు. వారి భవిష్యత్‌ను నాశనం చేయొద్దని, పాలిటెక్నిక్ విద్యను స్కిల్డ్ యూనివర్సిటీలో కలపొద్దని వాళ్లు పోరాటం చేస్తుంటే.. విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి వారితో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిగా విద్యాశాఖను మీరే అట్టిపెట్టుకోవడం రాష్ట్ర విద్యార్థుల దౌర్భాగ్యమని ఎద్దేవా చేశారు. ఇటీవల ఇంజనీరింగ్ విద్యార్థులంతా క్రిమినల్ వేస్ట్ అని సీఎం మాట్లాడారన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అంతకంటే క్రిమినల్ వేస్ట్ అని విద్యార్థులు మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందన్నారు. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి? వరంగల్ పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లి ఆ పిల్లల బాధలు వినడం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అని ప్రశ్నించారు. అసలు పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో కలపమని ఎవరైనా మీకు దరఖాస్తు ఇచ్చారా? స్కిల్ యూనివర్సిటీ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ PPP మోడల్‌తో ఏర్పాటు చేశారు. దీనికి ప్రభుత్వంతో సంబంధం ఉండదన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను అందులో కలపడం అంటే ప్రైవేటుపరం చేయడమేనని అన్నారు. ప్రస్తుతం పాలిటెక్నిక్ పిల్లలు సంవత్సరానికి కేవలం రూ.5,000 చొప్పున మూడేళ్లకు రూ.15,000 ఫీజు కడితే చదువు పూర్తవుతుందని స్పష్టం చేశారు. రేపు స్కిల్ యూనివర్సిటీలో కలిపి ప్రైవేట్ పరం చేసి అడ్డగోలుగా ఫీజులు పెంచితే ఆ పేద పిల్లల భవిష్యత్తు ఏం కావాలని ప్రశ్నించారు. ఏఐసీటీఈ అనుమతితో చదువుతున్నారు కాబట్టే పాలిటెక్నిక్ పిల్లలకు డైరెక్ట్‌గా ఇంజనీరింగ్ సెకండియర్‌లో సీటు వస్తుంది. స్కిల్ యూనివర్సిటీలో కలిపితే వాళ్లు ఆ అవకాశాన్ని కోల్పోయి ఆగమైపోతారన్నారు. సీఎంకు కనీస అవగాహన లేక ఐటీఐలతో పాలిటెక్నిక్‌ను కలపడం వల్ల వారి జీవితాలు నాశనం అవుతున్నాయన్నారు. ఒక్క వరంగల్ పాలిటెక్నిక్ కళాశాలలోనే 10 మంది విద్యార్థుల తల్లిదండ్రులు భయపడిపోయి టీసీలు తీసుకుని వెళ్లిపోయారన్నారు. రేవంత్ రెడ్డి పుణ్యమా అని ఆ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
* బేషజాలకు పోకుండా జీవో 97ను రద్దు చేయాలి
పాలిటెక్నిక్ విద్యను యథావిధిగా ప్రభుత్వంలోనే నడపాలని మేం డిమాండ్ చేస్తున్నామన్నారు. పిల్లలు మాత్రం స్కిల్డ్ వర్సిటీలో కలపడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఢిల్లీ, ఏపీల్లో ఫెయిల్ అయిన ఈ చెత్త విధానాన్ని ఇక్కడ ఎందుకు రుద్దుతున్నావని ప్రశ్నించారు.
* ఇదా కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం ?
ఇదా కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం ?.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు.. అరెస్టులు చేస్తున్నారు.. అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి లేదా ? మీరు చేస్తున్న ఈ దౌర్జన్యాలకు తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
