Kalvakuntla Kavitha Press Meet Telangana Politics
* లండన్ డీల్ వెనుక అసలు నిజాలు
* హరీశ్ రావు బిగ్ స్కెచ్
* రేవంత్‌తో లండన్ ఒప్పందం
* బీఆర్ఎస్ కబ్జాకు కుట్ర
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాజకీయం ఒకేసారి పలు వివాదాలు, పరస్పర ఆరోపణలతో తీవ్ర వేడెక్కింది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో పాటు ప్రతిపక్షంలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
* ఆంధ్ర వ్యక్తులకు పదవులా… బ్రాహ్మణ పరిషత్ వివాదం
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల కేటాయింపు తీవ్ర వివాదాస్పదంగా మారింది. పొరుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తులకు ఈ కీలక పదవులు కట్టబెట్టడాన్ని, తెలంగాణ ఉద్యమకారులను దూషించడాన్ని స్థానిక బ్రాహ్మణ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ చర్యల వల్ల ముఖ్యమంత్రి “అనుముల రేవంత్ రెడ్డి” కాదని, “ఆంధ్ర రేవంత్ రెడ్డి” అని పిలవాల్సిన పరిస్థితి వస్తోందని మండిపడుతున్నారు. తెలంగాణ బ్రాహ్మణుల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా, వెంటనే బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్లను పదవుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
* హరీశ్ రావు పై క్విడ్ ప్రో కో కేసు నమోదు చేయాలి…
మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మరియు మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, గత ప్రభుత్వంలో మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని సొంత డెయిరీకి లాభం చేకూర్చిన హరీశ్ రావుపై తక్షణమే ‘క్విడ్ ప్రో కో’ కేసు నమోదు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ రంగానికి చెందిన విజయా డెయిరీని కాదని, తన సొంత డెయిరీ ద్వారా కార్పొరేట్ కాలేజీలు, ఆసుపత్రులు, సంస్థలకు పాలు సరఫరా చేస్తూ గత 8 ఏళ్లలో వందల కోట్ల వ్యాపారం చేయడం స్వార్థ ప్రయోజనం కాదా అని ప్రశ్నిస్తున్నారు. లండన్‌లో వీరి మధ్య ఎలాంటి ఒప్పందం జరగకపోతే, 500 మందికి పైగా విద్యార్థులు ఉన్న ప్రతి విద్యా సంస్థలో ప్రైవేటు డెయిరీలను నిషేధించి, కేవలం ప్రభుత్వ డెయిరీల నుంచే పాల సరఫరా జరిగేలా తక్షణమే జీవో ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
* కేసీఆర్‌కు వెన్నుపోటు..
మరోవైపు గులాబీ పార్టీలో కూడా అంతర్గత కుట్రలు షురూ అయినట్లు సమాచారం. బీఆర్ఎస్ను పూర్తిగా తన హస్తగతం చేసుకునేందుకు హరీశ్ రావు తెరవెనుక తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందులో భాగంగానే ఇటీవల మెదక్ జిల్లా ఎమ్మెల్యేలతో రహస్య సమావేశాలు ఏర్పాటు చేశారని ప్రచారం జరుగుతోంది. పార్టీ అధినేత కేసీఆర్‌కే వెన్నుపోటు పొడిచేందుకు ఈ మంతనాలు సాగుతున్నాయని, ఇందులో పాల్గొన్న ఒక ఎమ్మెల్యే ద్వారానే ఈ విషయాలు బయటపడ్డాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే బీజేపీతో కూడా మిలాఖత్ అయ్యారనడానికి తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని పలువురు నాయకులు ఆరోపిస్తున్నారు.
ఈ పరిణామాలన్నీ తెలంగాణ రాజకీయాల్లో రానున్న రోజుల్లో మరిన్ని ఊహించని మార్పులకు దారితీసేలా కనిపిస్తున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
