Ranabaali Release Date announced
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(విజయ్ పేరులో వి.. రష్మిక పేరులో రోష్) జంటగా నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ విడుదల తేదీ ఖరారైంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2026 అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలుత సెప్టెంబర్ 11న సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావించినప్పటికీ, తాజాగా విడుదల తేదీని అక్టోబర్‌కు మార్చింది.
* చారిత్రక నేపథ్యంలో కథ
1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలన కాలంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ‘రణబాలి’ కథను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. రాయలసీమ ప్రాంతంలోని చారిత్రక నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఇందులో యోధుడి తరహా పాత్రలో కనిపించనుండగా, ఆయన లుక్ ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.
* మరోసారి విజయ్–రష్మిక జోడీ
‘డియర్ కామ్రేడ్’ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం కావడంతో ‘రణబాలి’పై అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా వివాహం తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి చిత్రం కావడం కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. రష్మిక ఈ సినిమాలో జయమ్మ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంతర్జాతీయ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
