Digital Crop Booking Kamalapur
* డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే కొనసాగుతుంది
* రైతులు పంట పొలాల్లో సాగుచేసిన వివరాలు వాలంటీర్లకు అందించాలి
* మండల వ్యవసాయ అధికారి వేణు
ఆకేరు న్యూస్, కమలాపూర్:
ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టిన డిజిటల్ క్రాప్ బుకింగ్ వివరాలు రైతులకు భరోసాగా ఉంటుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు, పంటల కొనుగోలుకు ఆయా వివరాలు ఉపయోగపడతాయని మండల వ్యవసాయ అధికారి వేణు తెలిపారు. కమలాపూర్ మండలంలో వానాకాలం పంటల సాగు వివరాలను నమోదు చేసే డిజిటల్ క్రాప్ బుకింగ్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో ఈ సర్వే జరుగుతుండగా గురువారం భీంపల్లి గ్రామంలో డిజిటల్ క్రాప్ బుకింగ్ ప్రక్రియను మండల వ్యవసాయ అధికారి వేణు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంటల సాగు వివరాలు ఎటువంటి పొరపాట్లు లేకుండా సక్రమంగా ఆన్లైన్లో నమోదు చేయాలని వాలంటీర్లకు ఆయన పలు సూచనలు చేశారు. రైతులు తమ పొలాల్లో సాగు చేసిన వివరాలను వాలంటీర్లకు కచ్చితంగా అందించి, ఈ సర్వేను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప్పల్ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి తిరుపతి , స్థానిక వాలంటీర్లు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
