Kodad CI Attack Allegations
అకేరు న్యూస్ సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని 32వ వార్డులో రాత్రికి రాత్రే ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమ షాపులను మున్సిపల్ అధికారులు తొలగించారంటూ బాధితులు ఆందోళనకు దిగారు.
తమ షాపులను తొలగించడానికి మున్సిపల్ కమిషనర్‌కు పండుగ మామూళ్లు ఇవ్వకపోవడమే కారణమని బాధితులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై మున్సిపల్ కమిషనర్, అధికారుల తీరును నిరసిస్తూ బాధితులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు.
ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న కోదాడ టౌన్ సీఐపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆందోళన చేస్తున్న ఓ వ్యక్తిపై దాడి చేసి, కాలర్ పట్టుకుని నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లారని బాధితులు ఆరోపిస్తున్నారు.
అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళలను కూడా నెట్టివేశారని పేర్కొన్నారు.
అనంతరం ఆందోళన చేస్తున్న బాధితులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు సమాచారం. దీంతో కోదాడలో పోలీసుల వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
