Nalgonda Government Hospital Newborn Death
అకేరు న్యూస్ : నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందడం కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
డెలివరీ కోసం కంభంపాటి కవిత ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. తొలుత నార్మల్ డెలివరీ అవుతుందని వైద్యులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఒక రోజు తర్వాత శిశువు హార్ట్‌బీట్ సరిగా లేదని చెప్పి ఆపరేషన్ చేశారని ఆరోపించారు.
ఆపరేషన్ అనంతరం శిశువు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. శిశువు పరిస్థితి విషమంగా ఉందని చెప్పిన సమయంలో వైద్యులు అందుబాటులో లేరని, ఉదయం వస్తారని చెప్పి నర్సులే వైద్యం చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు.
వైద్యులు అందుబాటులో లేకపోవడం, నర్సులతోనే చికిత్స చేయించడం వల్లే తమ బిడ్డ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఘటనపై అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
