Minister Konda Surekha BC Support
Published:
అకేరు న్యూస్ హైదరాబాద్ : కొండా సురేఖకు మద్దతుగా బీసీ నేతలు గళం విప్పారు. సురేఖపై కాంగ్రెస్‌లోని అగ్రవర్ణ నేతలు కుట్రలు చేస్తున్నారంటూ బీసీ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది.
మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తొలగించే ప్రయత్నాలు చేస్తే సహించబోమని బీసీ నాయకులు హెచ్చరించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన పద్మశాలి సర్పంచుల అభినందన సభలో సురేఖకు మద్దతుగా తీర్మానం ప్రవేశపెట్టారు.
తెలంగాణలోని 5,035 మంది సర్పంచుల తరఫున కొండా సురేఖకు మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేసినట్లు బీసీ నేతలు తెలిపారు. సురేఖకు అన్యాయం జరిగితే బీసీ సమాజం మొత్తం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
ఈ వార్తకు సంబంధించిన బృందం

కరస్పాండెంట్
ఇనుగాల కిశోర్ , MA (Mass Communication )
12 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
