Chiranjeevi on GV Narayana Rao
* పది రోజుల క్రితం కలిశాడు
* మాది ఆత్మీయ అనుబంధం
– నటుడు నారాయణ రావు గురించి చిరంజీవి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
అదే చివరి ఫోటో అవుతుందనుకోలేదు.. పది రోజుల క్రితం నారాయణరావు నా దగ్గరకు వచ్చారు.
నేను మంచు పల్లకి ఇన్స్పిరేషన్తో ఒక సినిమా చేశాను. ఆ సినిమాలోని ఐదుగురు కుర్రవాళ్లు.. పెద్దవాళ్లు అయితే ఎలా ఉంటారో అన్నదే కథ.. అన్నారు ఆ సందర్భంగా కలిసి ఫోటో దిగామని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.. ప్రముఖ నటుడు, నిర్మాత జి.వి. నారాయణరావు గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయనతో ఉన్న అనుబందాన్ని పంచుకున్నారు..
ఆ విషయాలు ఆయన మాటల్లోనే..
ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ రోజుల నుంచి మా ఇద్దరి మద్య పరిచయం ఉంది. నారాయణ రావు మా కంటే సీనియర్.. తను తరచుగా తన అనుభవాలను మాతో పంచుకునేవారు. అలా మాకు దగ్గరయ్యారు. ఇండస్ట్రీలో ఎవరికి వాళ్లం ఎదిగాం. నాకు స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత ‘‘నేను నిర్మాతగా నిలబడాలనుకుంటున్నాను. నువ్వు సినిమాలు చేయాలని’’ అడిగారు. అలా ఆయన నిర్మాణంలో రెండు సినిమాలు చేయడం జరిగింది. నా సినిమాల్లో తనకు నటుడిగా కూడా అవకాశాలు వచ్చేలా చేయడం జరిగింది. అలా మా అనుబంధం కొనసాగుతూ వచ్చిందన్నారు.. చివరి సారిగా కలిసినప్పుడు చాలా సేపు మాట్లాడుకున్నాము. ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలని చెప్పాను. ఆ క్షణంలో తనకి ఆల్ ది బెస్ట్ చెప్పాను. అదే మాట శాశ్వతంగా గుడ్‌బై అవుతుందని అనుకోలేదని చిరంజీవి వాపోయారు..
——————————————————-

Please tell us what is wrong. Your report will be sent to the website team.
