Kakinada Gym Trainer Satish Murder Case
అకేరు న్యూస్ కాకినాడ : కాకినాడ జిమ్ ట్రైనర్ సతీష్ హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. అయితే కేసును పోలీసులు తప్పుదారి పట్టించేలా దర్యాప్తు చేస్తున్నారని సతీష్ భార్య జయశ్రీ ఆరోపించారు. తన భర్త హత్య వెనుక ఎవరెవరి పాత్ర ఉందో సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
నిందితుడు సాయి కిరణ్‌ను తమ కుటుంబం సొంత తమ్ముడిలా చూసుకుందని జయశ్రీ తెలిపారు. కొంతకాలం తమ ఇంట్లోనే ఉంచుకుని అన్నం పెట్టామని, అలాంటి వ్యక్తినే తన భర్తను కిరాతకంగా హత్య చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.
నా భర్త హత్య వెనుక అసలు ఎవరున్నారు? హత్యకు కారణాలేంటి? అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలి. టూ టౌన్ పోలీసులు కేసును తప్పుదారి పట్టిస్తున్నారు అంటూ జయశ్రీ ఆరోపించారు. ఈ కేసులో అసలు నిజాలను వెలుగులోకి తీసుకురావాలని ఆమె పోలీసు ఉన్నతాధికారులను కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
