Aadith Arun Bigg Boss Telugu 10
అకేరు న్యూస్ హైదరాబాద్ : బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్‌పై ఇప్పటి నుంచే ఆసక్తి మొదలైంది. షోలో పాల్గొనే కంటెస్టెంట్ల విషయంలో రోజుకో పేరు తెరపైకి వస్తుండగా.. తాజాగా నటుడు ఆదిత్ అరుణ్ పేరు వినిపిస్తోంది. ఇటీవల ‘చెన్నై లవ్ స్టోరీ’లో కనిపించిన ఈ హీరోను బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకొచ్చేందుకు నిర్వాహకులు సంప్రదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
* సెప్టెంబరులో ప్రారంభం?
తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో ఒకటైన బిగ్‌బాస్ కొత్త సీజన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 10వ సీజన్‌ను సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. సెప్టెంబర్ 6న గ్రాండ్ లాంచ్ ఉండొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే దీనిపై షో నిర్వాహకుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
బిగ్‌బాస్ తెలుగు 10కి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం.
* ఆదిత్ అరుణ్ ఎంట్రీపై ఆసక్తి
ఆదిత్ అరుణ్ తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. విభిన్న పాత్రల్లో కనిపించిన ఆయనకు యువ ప్రేక్షకుల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెడితే షోకు కొత్త ఉత్సాహం వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఆదిత్ అరుణ్ బిగ్‌బాస్ తెలుగు 10లో పాల్గొంటున్నారనే విషయాన్ని నిర్వాహకులు ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించలేదు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
