Warangal Pediatrics Conference 2026
* పీడియాట్రిక్ వైద్య నిపుణులు
అకేరు న్యూస్ వరంగల్ : నవజాత శిశువులు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణతో పాటు శిశు మరియు మాతృ మరణాల రేటును గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా వరంగల్‌లో ‘సెంట్రల్ జోన్ పీడియాట్రిక్స్ కాన్ఫరెన్స్’ ప్రారంభమైంది.
కాన్ఫరెన్స్ వర్క్‌షాప్ చైర్మన్ డాక్టర్ బలరామ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో యంగ్ డాక్టర్లకు ఆరు కీలక అంశాలపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో శిశువులకు అందించాల్సిన వైద్యం, ఆధునిక చికిత్సా విధానాలపై నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు.
ఈ సందర్భంగా CIAP ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు డాక్టర్ బి. సుగుణాకర్ రెడ్డి, డాక్టర్ కె. రాజశేఖర్ రావు, డాక్టర్ కె. వెంకటేశ్వర్ రావు, డాక్టర్ ఎం. శేషు మాధవ్, అలాగే PATS ప్రతినిధులు డాక్టర్ గుడూరు విజయ్ కుమార్, డాక్టర్ ఎస్. కృష్ణమూర్తి, డాక్టర్ సుంకోజ్ భాస్కర్, డాక్టర్ ఎన్.ఎల్. శ్రీధర్, డాక్టర్ శ్రీకృష్ణ ఆర్ఎస్వీ తదితరులు మాట్లాడారు.
అత్యవసర వెంటిలేషన్, పాయింట్ ఆఫ్ కేర్ అల్ట్రాసౌండ్ (POCUS), చిన్నారుల్లో పోషకాహార లోపాల నివారణ, అలర్జీల చికిత్స, చిన్నారులపై జరుగుతున్న హింసను అరికట్టడం వంటి అంశాలపై వైద్యులకు ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. IAP ప్రెసిడెన్షియల్ యాక్షన్ ప్లాన్–2026లో భాగంగా బాలల ఆరోగ్య సంరక్షణకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
అలాగే వరంగల్ పీడియాట్రిక్ సొసైటీ నాయకులు డాక్టర్ జి. రమేష్, డాక్టర్ పి. అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
2030 నాటికి నిర్దేశించుకున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (SDG) మేరకు శిశు, మాతృ మరణాలను గణనీయంగా తగ్గించడం, నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించడం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని వైద్య నిపుణులు స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
