Hyderabad Night Bus Services
* సెప్టెంబర్ 1 నుంచి నైట్ సర్వీసులు
* 6 రూట్లు.. 15 బస్సులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో రాత్రివేళ ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుడ్‌న్యూస్ చెప్పింది. రాత్రి వేళల్లో ప్రజా రవాణా అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరు ప్రధాన మార్గాల్లో నైట్ బస్ సర్వీసులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ సేవలు సెప్టెంబర్ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. తొలి దశలో మొత్తం 15 బస్సులను ఆరు రూట్లలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి సర్వీసుల ఫ్రీక్వెన్సీని సుమారు 30 నిమిషాల నుంచి గంట వరకు ఉంచనున్నారు.
* ఆరు ప్రధాన రూట్లు ఇవే..
– 10H: సికింద్రాబాద్ – హైటెక్ సిటీ – కొండాపూర్
– 195W: బాచుపల్లి – వేవ్‌రాక్
– 290U: సికింద్రాబాద్ – హయత్‌నగర్
– 218: కోఠి – పటాన్చెరు
– 222A: కోఠి – పటాన్చెరు
– 219: సికింద్రాబాద్ – పటాన్చెరు
ఐటీ కారిడార్‌తో పాటు రాత్రివేళ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను కలుపుతూ ఈ మార్గాలను ఎంపిక చేశారు.
* నైట్ షిఫ్ట్ ఉద్యోగులకు ప్రయోజనం..
హైటెక్ సిటీ, కొండాపూర్, పటాన్చెరు, బాచుపల్లి వంటి ప్రాంతాల్లో ఐటీ, హాస్పిటాలిటీ, ఇతర రంగాల్లో రాత్రి షిఫ్టుల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ సేవలు ఉపయోగపడనున్నాయి. అలాగే రాత్రి వేళల్లో ప్రయాణించే ఇతర ప్రయాణికులకు కూడా ప్రజా రవాణా అందుబాటులో ఉండనుంది. రాత్రి వేళల్లో ప్రయాణికుల స్పందనను పరిశీలించి అవసరాన్ని బట్టి భవిష్యత్‌లో మరిన్ని మార్గాలకు నైట్ బస్ సర్వీసులను విస్తరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
