Sri Venkateswara Kalyanam in Chilpur
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంలో
శ్రావణమాసం పురస్కరించుకొని శ్రీ బుగులు వేంకటేశ్వర వార కళ్యాణం వైభవంగా నిర్వహించారు. శ్రావణమాసము మూడవ శనివారం కావడంతో కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈవో లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ధర్మకర్త మండలి సభ్యులు గోలీ రాజశేఖర్, గణగోని రమేష్, జూనియర్ అసిస్టెంట్ రాజేందర్ రెడ్డి, ముఖ్య అర్చకులు బ్రాహ్మణపల్లి రవీందర్ శర్మ అర్చకులు సౌమిత్రి శ్రీరంగాచార్యులు, కృష్ణమాచార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. రెడ్డిపల్లి వాస్తవ్యులు చిలుపురి రవీందర్ రెడ్డి-కవిత, మొరా శ్రీనివాస్ – మంజుల అన్నదాన వితరణ చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
