TGTET 2026 Exam Schedule
* TGTET-2026 షెడ్యూల్ రిలీజ్
* 24,983 మంది టీచర్లు హాజరు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో ఇన్-సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించనున్న TGTET ఇన్-సర్వీస్ టీచర్స్-2026 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 8, 9 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. పేపర్-1 పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరగనుంది.
* 24,983 మంది టీచర్లు..
ఈ పరీక్షలకు మొత్తం 24,983 మంది ఇన్-సర్వీస్ టీచర్లు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థులు పరీక్ష తేదీ, సమయాలను ముందుగానే గమనించి, పరీక్షకు అవసరమైన సూచనలు, నిబంధనలను పాటించాలని అధికారులు సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
