Akkineni Nagarjuna King 100 Glimpse release
* నాగార్జున .. కింగ్ 100 గ్లింప్స్ రిలీజ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 100వ సినిమా ‘కింగ్ 100’ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ ప్రత్యేక ట్రీట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాకు తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు
* టీజర్.. రూ.50 వేల కోట్ల స్కామ్..
మనుషుల్లో రెండు రకాలు.. డబ్బున్నోళ్లు డబ్బుల్లేన్నోళ్లు.. డబ్బులేనప్పుడు నన్ను లూజర్ అన్నారు.. డబ్బు ఉన్నప్పుడు దే కాల్ మి ద కింగ్.. దిస్ ఐడెంటిటి మోర్ పవర్ ఫుల్ టు మనీ .. ఆ ఐడెంటిటి నిలబెట్టుకోవడం కోసం నేను పరిగెడుతూనే ఉండాలి అని టీజర్ లో నాగార్జున చెప్పిన డైలాగు ఆకట్టుకుంది.
కింగ్ 100గా టైటిల్ ప్రకటించారు మేకర్స్. డైలాగుతో స్టార్ట్ అయిన టీజర్ అధ్యాంతం సినిమాపై హైప్ క్రియెట్ చేసింది. కింగ్ కు తగ్గట్టుగానే బ్యాగ్ గ్రౌండ్ బీజీఎం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక నాగార్జున కారులో నుంచి దిగడం.. ఆ తర్వాత రూ.50 వేల కోట్ల స్కామ్ చేసినట్లు పోస్టర్ కనిపించడం సినిమాపై మరింత ఉత్కంఠను పెంచుతోంది. ‘ ఒక పేపర్ హెడ్ లైన్ .. ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్ ఏ కామన్ మ్యాన్ టర్న్స్ యాజ్ కాన్ మ్యాన్ అంటూ స్కామ్ కు సంబంధించిన కథ అంటూ చెప్పకనే మేకర్స్ చెబుతున్నారు. నాగార్జున లూక్స్ బాగున్నాయి. మరోసారి తన లూక్ తో ఫ్యాన్స్ ను కట్టిపడేశారు.
* డిసెంబరు 24 విడుదల..
కింగ్ నాగార్జున నటిస్తున్న కింగ్ 100 నిజంగా ఇది ఆయన వందవ సినిమా. టైటిల్ కూడా ఇదే కావడం ఆశ్చర్యం. ఈ సినిమా డిసెంబరు 24వ తేదీ 2026 థియేటర్లలో సందడి చేయనుంది. 2025లో శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన కబేర.. ఆత ర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన కూలీలో కనిపించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
