* కేబీసీ 18లో అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
అకేరు న్యూస్ హైదరాబాద్:
‘కౌన్ బనేగా క్రోర్‌పతి’ సీజన్ 18లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన విద్యాభ్యాస సమయంలో ఎదురైన ఇబ్బందులను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఒకప్పుడు భారత విదేశీ వ్యవహారాల సర్వీస్ (ఐఎఫ్ ఎస్)లో చేరాలని అనుకున్న విషయాన్ని వెల్లడించారు.
అమితాబ్ బచ్చన్ తన గ్రాడ్యుయేషన్ రోజుల అనుభవాలను గుర్తు చేసుకున్నారు. “మా రోజుల్లో గ్రాడ్యుయేషన్ చేయడం చాలా ముఖ్యమని మా నాన్నగారు చెప్పేవారు. నేను సైన్స్ తీసుకున్నాను. అయితే మొదటి లెక్చర్లోనే పాఠశాలలో పదేళ్లుగా చదివిన విషయాలన్నీ చెప్పేశారు. దీంతో ఆ సబ్జెక్ట్ ఎంచుకోవడం తప్పు చేశానేమో అనిపించింది. చివరకు పరీక్షలో ఫెయిల్ అయ్యాను. ఆ తర్వాత అప్పట్లో ఉన్న విధానం ద్వారా రెండు మార్కుల తేడాతో పాస్ అయ్యాను. ఈ విషయం ఎవరికీ చెప్పకండి” అంటూ సరదాగా తన అనుభవాన్ని పంచుకున్నారు.
* ‘ఐ’ అంటే తెలియదు
అమితాబ్ బచ్చన్ ఒక దశలో సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయాలని కూడా ఆలోచించినట్లు తెలిపారు. అయితే ఐఎఫ్ఎస్ గురించి తనకు పెద్దగా అవగాహన లేకపోవడంతో ఆ ఆలోచనను ముందుకు తీసుకెళ్లలేకపోయానని చెప్పారు.
“ఇక్కడికి చాలా మంది కంటెస్టెంట్లు వచ్చి ఎపీఎస్సీ పరీక్ష రాయాలని ఉందని చెబుతుంటారు. విదేశీ వ్యవహారాల సర్వీస్ అనేది ఎంతో గొప్ప, అందమైన రంగం. ఒక విషయం నేను కూడా చెప్పాలనుకుంటున్నాను. ఒకప్పుడు నా మనసులో కూడా ఐఎఫ్ఎస్ లో చేరాలనే ఆలోచన వచ్చింది. కానీ ఐఎఫ్ఎస్ లో ‘ఐ’ అంటే ఏమిటో కూడా నాకు తెలియదు. అందుకే ఆ ఆలోచనను వదిలేశాను” అని అమితాబ్ వెల్లడించారు.
* తన చదువును కొనసాగించాలని..
ఈ సంభాషణకు కారణం కంటెస్టెంట్ ప్రగతి కల్పేకర్. తన చదువును కొనసాగించాలనే లక్ష్యాన్ని ఆమె అమితాబ్‌తో పంచుకున్నారు. బహుమతి మొత్తాన్ని ఎలా ఉపయోగించాలనుకుంటున్నారని అడిగినప్పుడు.. ఉన్నత విద్యను కొనసాగించి, భవిష్యత్తులో ఐఎఫ్ఎస్ అధికారిగా మారేందుకు కృషి చేయాలనుకుంటున్నట్లు ప్రగతి తెలిపారు.
* రోజూ రాత్రి 9 గంటలకు..
‘కౌన్ బనేగా క్రోర్‌పతి’ సీజన్ 18 సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్‌లో ప్రసారం అవుతోంది. అలాగే సోనీ లైవ్ లో డిజిటల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
