Tara Sutaria Praises Yash
* బాలీవుడ్ నటి తారా సుతారియా ప్రశంసలు
అకేరు న్యూస్, హైదరాబాద్: బాలీవుడ్ నటి తారా సుతారియా తన ‘టాక్సిక్’ కో-స్టార్, కన్నడ సూపర్‌స్టార్ యష్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకుంటూ యష్ వ్యక్తిత్వం, ఆలోచనా విధానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘టాక్సిక్’ సినిమాలో అతిగా పురుషాధిక్యాన్ని ప్రోత్సహించేలా కథనం ఉందంటూ, మహిళా పాత్రలను సున్నితత్వం లేకుండా చూపించారనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో తారా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
* ఇలాంటి వ్యక్తి చాలా అరుదు
ది మేల్ ఫెమినిస్ట్’ అనే పాడ్‌కాస్ట్‌లో తారా పాల్గొన్నారు. యష్లోని సానుభూతి, ఇతరుల పట్ల శ్రద్ధ చూపించే స్వభావాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. “ఆయన ఎంతో సున్నితమైన మనస్తత్వం ఉన్న వ్యక్తుల్లో ఒకరు. నిజంగా చెప్పాలంటే, తన గురించి ఆలోచించుకోవడం కంటే ఎదుటి వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మన ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడటం చాలా అరుదు. నేను ఇప్పటివరకు కలిసిన వారందరికంటే ఆయన చాలా భిన్నంగా ఉంటారు. ఇతరుల పట్ల ఎంతో శ్రద్ధగా, ఆలోచనతో వ్యవహరిస్తారు” అని తారా తెలిపారు.
* ప్రేయసి పాత్ర
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ‘టాక్సిక్’ లో యష్‌తో కలిసి తారా సుతారియా కీలక పాత్రలో నటించారు. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో ఆమె యష్ ప్రేయసి పాత్రను పోషించారు.
* తనకు డిస్కాల్కులియా అనే లెర్నింగ్ డిజార్డర్
ఇదే పాడ్‌కాస్ట్‌లో తారా తనకు డిస్కాల్కులియా అనే లెర్నింగ్ డిజార్డర్ ఉందని వెల్లడించారు. గణితాన్ని అర్థం చేసుకోవడం, సంఖ్యలను ప్రాసెస్ చేయడంలో ఇబ్బంది కలిగించే ఈ సమస్య కారణంగా తాను తరచూ లెక్కల్లో పొరపాట్లు చేస్తానని చెప్పారు. అందుకే తన ఆర్థిక వ్యవహారాలు, ఇతర పత్రాలకు సంబంధించిన పనులను నిర్వహించేందుకు తండ్రి, అకౌంటింగ్ టీమ్‌పై ఆధారపడుతున్నట్లు తెలిపారు.
* వీర్ పహారియాతో బ్రేకప్
ఈ ఏడాది ప్రారంభంలో నటి తారా సుతారియా.. నటుడు వీర్ పహారియాతో కొన్ని నెలల డేటింగ్ అనంతరం విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. తారా సుతారియా 2019లో విడుదలైన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రంతో హిందీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
