IOB Recruitment 2026 notification
* నెలకు రూ.1.05 లక్షల వరకు జీతం
* డిగ్రీతోనే అవకాశం
అకేరు న్యూస్, డెస్క్: ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలు, కార్యాలయాల్లో వివిధ విభాగాల్లో 291 స్పెషలిస్ట్, జనరలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థులు ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 15, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
* 291 పోస్టులు.. ఏ విభాగాల్లో అంటే?
ఈ నియామకంలో బ్రాంచ్ మేనేజ్మెంట్, ఐటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, IS ఆడిట్, సెక్యూరిటీ, డేటాబేస్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్, సైబర్ సెక్యూరిటీ, క్రెడిట్, రిస్క్ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
| పోస్టు / విభాగం | ఖాళీలు |
|---|---|
| మేనేజర్ – బ్రాంచ్ మేనేజ్మెంట్ | 100 |
| మేనేజర్ / సీనియర్ మేనేజర్ – ఐటీ | 75 |
| మేనేజర్ / సీనియర్ మేనేజర్ – ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ | 8 |
| మేనేజర్ / సీనియర్ మేనేజర్ – IS ఆడిట్ | 7 |
| అసిస్టెంట్ మేనేజర్ – సెక్యూరిటీ | 25 |
| సీనియర్ మేనేజర్ – డేటాబేస్ / నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ | 15 |
| సీనియర్ మేనేజర్ – సైబర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ | 5 |
| మేనేజర్ / సీనియర్ మేనేజర్ – క్రెడిట్ | 50 |
| సీనియర్ మేనేజర్ – రిస్క్ | 6 |
| మొత్తం | 291 |
* విద్యార్హత, అనుభవం
పోస్టును బట్టి అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, BE/BTech, ME/MTech, MBA (Finance) తదితర విద్యార్హతలు కలిగి ఉండాలి. సంబంధిత పోస్టుకు నిర్దేశించిన పని అనుభవం కూడా తప్పనిసరి. కాబట్టి దరఖాస్తు చేసే ముందు పోస్టు వారీగా విద్యార్హత, అనుభవ నిబంధనలను అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించాలి. పోస్టును బట్టి అభ్యర్థుల వయస్సు 25 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఇతర అర్హత కలిగిన రిజర్వేషన్ కేటగిరీలకు వయోసడలింపు వర్తిస్తుంది.
* ఎంపిక ఎలా ఉంటుంది?
IOB SO నియామకంలో అభ్యర్థుల ఎంపిక ప్రధానంగా ఆన్లైన్ CBT పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. అవసరాన్ని బట్టి ముందుగా దరఖాస్తుల స్క్రీనింగ్ కూడా చేపట్టవచ్చు. ఆన్లైన్ పరీక్షలో ప్రొఫెషనల్ నాలెడ్జ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. తుది మెరిట్ జాబితాలో ఆన్లైన్ పరీక్షకు 80 శాతం వెయిటేజీ, ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీ ఇస్తారు.
* జీతం ఎంత?
ఎంపికైన అభ్యర్థులకు పోస్టు, గ్రేడ్‌ను బట్టి మంచి వేతనం లభిస్తుంది. JMGS-I గ్రేడ్‌లో రూ.48,480 నుంచి రూ.85,290 వరకు, MMGS-IIలో రూ.64,820 నుంచి రూ.93,960 వరకు, MMGS-IIIలో రూ.85,920 నుంచి రూ.1,05,280 వరకు పే స్కేల్ ఉంటుంది. వీటితో పాటు బ్యాంకు నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు కూడా అందుతాయి.
* దరఖాస్తు రుసుము
| కేటగిరీ | దరఖాస్తు రుసుము |
|---|---|
| General / OBC / EWS | ₹1,000 |
| SC / ST / PwBD / ESM / మహిళలు | ₹175 |
* ఎలా దరఖాస్తు చేయాలి?
IOB SO రిక్రూట్మెంట్కు ఆగస్టు 29, 2026 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు సెప్టెంబర్ 15, 2026లోపు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లోని Recruitment/Careers విభాగానికి వెళ్లి సంబంధిత రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, పని అనుభవ వివరాలను నమోదు చేయాలి. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి, వర్తించే దరఖాస్తు రుసుమును చెల్లించిన తర్వాత అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
* అధికారిక వెబ్సైట్: https://www.iob.bank.in/en/
* అధికారిక ప్రకటన: https://www.iob.bank.in/documents/d/guest/Revised-FINAL-Web-Ad-Recruitment-Gen-Spl-2026-27
Please tell us what is wrong. Your report will be sent to the website team.
