NMDC Hyderabad Marathon 10K Run
* మాదాపూర్–గచ్చిబౌలి మార్గాల్లో ట్రాఫిక్ జామ్
* ప్రత్యామ్నాయ దారుల్లో మళ్లింపు
* ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ :
ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్‌లో భాగంగా నిర్వహిస్తున్న 10కే రన్‌తో ఆదివారం హైదరాబాద్‌లోని పలు ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపు అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం, బయో డైవర్సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్‌పై ప్రభావం పడింది. 10కే రన్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ నుంచి ప్రారంభమై ఎన్ఏసీ మెయిన్ గేట్, ఖానామెట్ జంక్షన్, మెటల్ చార్మినార్ జంక్షన్, సీఐఐ జంక్షన్, టెక్ మహీంద్రా, డెల్ జంక్షన్, లెమన్ ట్రీ జంక్షన్, ఐకియా అండర్‌పాస్, బయో డైవర్సిటీ జంక్షన్, టెలికాం నగర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, ఇంద్రానగర్, ఐఐఐటీ జంక్షన్ మీదుగా జీఎంసీ బాలయోగి స్టేడియానికి చేరుకునేలా మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి పరిసరాలు, గచ్చిబౌలి ఫ్లైఓవర్, ఐఐఐటీ జంక్షన్, టెక్ మహీంద్రా, లెమన్ ట్రీ జంక్షన్, రాయదుర్గం–ఐకియా మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు ముందుగానే హెచ్చరించారు. మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం, గచ్చిబౌలి ప్రాంతాల్లో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. మరోవైపు, గచ్చిబౌలి జంక్షన్ నుంచి విప్రో జంక్షన్ వైపు వెళ్లే వాహనాలను ఇంద్రానగర్ టీ జంక్షన్ వద్ద ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించే ఏర్పాట్లు చేశారు. రన్నింగ్ ఈవెంట్ జరిగే మార్గాల్లో భారీ వాహనాల రాకపోకలపై కూడా ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో ఐకియా, బయో డైవర్సిటీ, గచ్చిబౌలి స్టేడియం వైపు ప్రయాణించే వాహనదారులు ముందస్తుగా ప్రయాణాలను ప్లాన్ చేసుకుని, ట్రాఫిక్ పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
