Ramachandra Naik Wedding Event
ఆకేరు న్యూస్, నరసింహులపేట: మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండల PACS చైర్మన్, మాజీ ఎంపీపీ సంపేట రాముగౌడ్ – సుజాత దంపతుల కుమారుడి వివాహం ఆదివారం జరిగింది. ఈ పెళ్లికి ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్, తొర్రూర్ ఏఎంసీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి హాజరయ్యారు. వారు వధూవరులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ బట్రు నాయక్, కాంగ్రెస్ తొర్రూర్ మాజీ అధ్యక్షుడు సుంచు సంతోష్, మెరుగు మల్లేశం గౌడ్, మండల నాయకులు ఏ. నరేందర్ రెడ్డి, చిట్టిమల్ల మహేష్, సీనియర్ రిపోర్టర్ పంజాల శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
