Errabelli Dayakar Rao BRS Protest Against Congress Government
* 1000 రోజుల పాలనలో విఫలం
* రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై సమర శంఖం
* సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు నిరసన
* మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు
ఆకేరు న్యూస్, రాయపర్తి :
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 42 హామీలను విస్మరించి 1000 రోజుల పాలనతో ప్రజలను దగా చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మండల ముఖ్య నాయకులతో ఆదివారం ఆయన అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ… సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు వారం రోజుల పాటు పాలకుర్తి నియోజకవర్గంలో గ్రామాలు, గల్లీల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలను ఎండగట్టేలా నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.
* కార్యాచరణ..
నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, వార్డు, గల్లీల్లో కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో జరిగిన అన్యాయాలపై ప్రజలను చైతన్యం చేయడం.. 6 గ్యారంటీలు, 42 హామీల అమలుపై స్థానిక ప్రజలతో కలిసి కాంగ్రెస్ నాయకులను నిలదీయడం.. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ పోరాటం ఆగదని, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు. వారం రోజుల పాటు జరిగే ఈ ఆందోళన కార్యక్రమాలలో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు, ఎం. నరసింహ నాయక్, మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ కుమార్ గౌడ్, మాజీ మండల ప్రధాన కార్యదర్శి పూస మధు, రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్, నాయకులు లేతాకుల రంగారెడ్డి, కర్ర రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఐత రామచందర్, బందెల బాలరాజు, ముద్రబోయిన సుధాకర్, సంకినేని ఎల్ల స్వామి, ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
