Yeshanagula Song Trending No 1
* యూట్యూబ్‌లో ‘ఏశనాగుల’ సాంగ్ హవా..
ఆకేరు న్యూస్, డెస్క్: నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ (The Paradise). ‘దసరా’ తర్వాత ఈ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ‘ఏశనాగుల’ పాట యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. పాట విడుదలైన కొద్ది గంటల్లోనే ఇండియా వైడ్ నంబర్ 1 ట్రెండింగ్‌లోకి వచ్చి మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు భారీగా వ్యూస్, లైక్స్ వస్తుండటంతో పాటు సోషల్ మీడియాలోనూ విపరీతంగా షేర్ అవుతోంది.
* తెలంగాణ జానపద శైలిలో మాస్ సాంగ్
‘ఏశనాగుల’ (yeshanagula song) పాటకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ప్రముఖ రచయిత కాసర్ల శ్యామ్ తెలంగాణ జానపద శైలిలో సాహిత్యాన్ని అందించారు. ప్రభా బంగారిగళ్ల, అద్దుల జంగిరెడ్డి ఈ పాటను ఆలపించారు. మాస్ బీట్స్, జానపద టచ్‌తో ఉన్న ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో పాటకు సంబంధించిన మాస్ బీట్స్ వైరల్ అవుతున్నాయి.
* డిఫరెంట్ మాస్ లుక్‌లో నాని
‘ది ప్యారడైజ్’లో నాని ‘జడల్’ అనే రస్టిక్, వైలెంట్ పాత్రలో కనిపించనున్నారు. జడలు వేసిన జుట్టు, ముక్కుపుడకలు, పెద్ద బొట్టుతో నాని ఇంతకుముందెన్నడూ చూడని డిఫరెంట్ మాస్ లుక్‌లో కనిపించనుండటం సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. మొత్తానికి ‘ఏశనాగుల’ పాట నంబర్ 1 ట్రెండింగ్‌లో నిలవడంతో ‘ది ప్యారడైజ్’పై హైప్ మరింత పెరిగింది. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
