Mulugu Two Brothers Died
అకేరు న్యూస్, ములుగు :
ములుగు మున్సిపాలిటీ పరిధిలోని గణేశ్లాల్పల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని మొండి కుంటలో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు.
మృతులు మాలోతు వినయ్ (15), రాజేష్ (12)గా గుర్తించారు. వీరు మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందినవారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తల్లితో కలిసి అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఇద్దరు అన్నదమ్ములు పెళ్లి వేడుకలో పాల్గొన్నారు.
అనంతరం బహిర్భూమికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు సమీపంలోని మొండి కుంటలో పడిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో గణేశ్లాల్పల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
