Deputy CM Pawan Kalyan Birthday Celebrations Telangana
* సెప్టెంబర్ 2న జనసేనాని జన్మదినోత్సవం
– జేఎస్పీ నాయకులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జన్మదినోత్సవాన్ని తెలంగాణ వ్యాప్తంగా అట్టహాసంగా నిర్వహించాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2న హైదరాబాద్ ఫిల్మ్‌చాంబర్ దేవస్థానంలోని ఆంజనేయస్వామి ఆలయంలో పవన్ కల్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజలతో వేడుకలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 10 గంటలకు కేక్ కట్ చేయడంతో పాటు యువజన విభాగం స్టిక్కర్‌ను ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయన్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాచపి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా బైక్ ర్యాలీలు నిర్వహించడంతో పాటు, ప్రత్యేక ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. అలాగే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధమవుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
