Veligonda Project Inauguration
* వెలిగొండ ప్రాజెక్ట్.. జాతికి అంకితం
* ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు
* కృష్ణమ్మకు జలహారతి
* భావోద్వేగంతో సాష్టాంగ నమస్కారం
ఆకేరు న్యూస్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మార్కాపురం జిల్లావాసుల చిరకాల స్వప్నం సాకారమైంది. ఏపీలో చారిత్రక ఘట్టం ఆవిషృతమైంది. వెలిగొండకు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. కృష్ణా జలాలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి తొలి దశను జాతికి అంకితం చేశారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రజలు, రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సభా ప్రాంగణంలో ఆకుపచ్చ కండువాలను గాల్లోకి తిప్పుతూ వెలిగొండ ప్రారంభోత్సవం సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.
* పంచకట్టుతో చంద్రబాబు..
సంప్రదాయ పంచకట్టుతో వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు వచ్చారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభించారు. దోర్నాల మండలం గంటవాని పల్లె వద్ద ఈ ప్రాజెక్టు సొరంగాల నుంచి వచ్చిన కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి జల హారతి ఇచ్చి సీఎం స్వాగతం పలికారు. గేట్లు ఎత్తి కృష్ణా జలాలను విడుదల చేయడంతో నల్లమల కొండల్లోని 2 సొరంగాల నుంచి గంటవాని పల్లెకు చేరుకుని నల్లమల సాగర్‌కు కృష్ణమ్మ పరుగులు పెట్టడంతో స్థానికుల ఆనందానికి హద్దులు లేవు.
* సాష్టాంగం..
వెలిగొండ ఫీడర్ కెనాల్ వద్ద సీఎం చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. జలహారతి ఇచ్చిన అనంతరం కాలువ ఒడ్డున కృష్ణమ్మకు సాష్టాంగ నమస్కారం చేశారు. దీంతో రైతులు, మహిళలు పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు. వెలిగొండ తొలి విడత పూర్తి చేసి నీటిని విడుదల చేసిన సందర్భంగా పైలాన్ ఆవిష్కరించారు.
* 30 ఏళ్ల కల నెరవేరిన వేళ..
వెలిగొండ ప్రారంభంతో 30 ఏళ్ల కల సాకారమైందని మార్కాపురం, ప్రకాశం జిల్లా వాసుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ప్రారంభోత్సవం సందర్భంగా సీఎంకు ఘన స్వాగతం పలికారు. మార్కాపురం ప్రాంతానికి నీటి వసతి కలిగితే వలసలు ఉండవని స్థానికులు, ప్రజా ప్రతినిధులు ఆనందంగా తెలిపారు. ఇంటింటికి తాగునీటి సరఫరా చేస్తుండడంతో ఫ్లోరైడ్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురానికి ప్రత్యేక జిల్లాగా చేయడం.. ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్టు మొదటి విడత నీటి విడుదలకు జరగడంతో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
