Prime Care Hospital Nurse Murder Case
* చిక్కిన మెకానిక్ సనావుల్లా ఖాన్
* సీసీ టీవీ, డాగ్ స్క్వాడ్ ఆధారాలు కీలకపాత్ర
ఆకేరు న్యూస్, డెస్క్ : ప్రైమ్ కేర్ హాస్పిటల్లో నర్సు హత్య కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బిహార్‌కు చెందిన సనావుల్లా ఖాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, నేరానికి సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.. ఆస్పత్రి సమీపంలో ఉన్న మెకానిక్ షాపులో పని చేస్తున్న సనావుల్లా ఖాన్, షాపు వెనుక భాగంలో ఉన్న నర్సుల హాస్టల్‌ను గమనించినట్లు పోలీసులు గుర్తించారు. శుక్రవారం రాత్రి హాస్టల్లో బాధితురాలు ఒంటరిగా ఉన్నట్లు తెలుసుకున్న నిందితుడు, గది కిటికీకి గ్రిల్స్ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని లోపలికి ప్రవేశించినట్లు తెలిసింది. బాధితురాలిపై లైంగికదాడికి యత్నించిన నిందితుడు, ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో గొంతు నులిమి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. అనంతరం మృతదేహంతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దీనిపై ఫోరెన్సిక్, పోస్టుమార్టం నివేదికల ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. హత్య అనంతరం నిందితుడు అర్ధరాత్రి 1 గంట సమయంలో మెకానిక్ షాపు యజమానికి ఫోన్ చేసి పెట్రోల్ కావాలని అడిగినట్లు తెలుసింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. కేసు దర్యాప్తులో భాగంగా డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలోనూ నిందితుడు అక్కడే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులను ఏం జరిగిందంటూ ప్రశ్నిస్తూ అనుమానం రాకుండా వ్యవహరించినట్లు సమాచారం. అయితే జాగిలం మెకానిక్ షాపు సమీపానికి వచ్చి ఆగడంతో పోలీసులు సనావుల్లా ఖాన్‌పై అనుమానం వ్యక్తం చేశారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించినట్లు పోలీసులు చెబుతున్నారు. సీసీ టీవీ ఫుటేజ్, డాగ్ స్క్వాడ్ ఆధారాలు కేసు దర్యాప్తులో కీలకంగా మారాయి. ప్రైమ్ కేర్ హాస్పిటల్ నర్సు హత్య ఘటన తీవ్ర కలకలం రేపగా, నిందితుడి అరెస్టుతో కేసులో కీలక పురోగతి సాధించినట్లు పోలీసులు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
