Mera Yuva Bharat Tadwai Block Volunteer
ఆకేరు న్యూస్, ములుగు: కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ పరిధిలోని ‘మేరా యువ భారత్’ సంస్థ జాతీయ యువజన దళం పథకం లో బాగంగా తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన కళ్ళేబోయిన అపర్ణ తాడ్వాయి బ్లాక్ వాలంటీర్‌గా ఎంపికయ్యారు. ఈ మేరకు వరంగల్ జిల్లా యువజన అధికారి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేశారు. దేశ నిర్మాణంలో, సామాజిక సేవా కార్యక్రమాల్లో యువతను భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా తాను పనిచేస్తానని, ‘వికసిత్ భారత్’ సాధనకు కృషి చేస్తానని అపర్ణ తెలిపారు. యువతీ యువకులు మై భారత్ పోర్టల్‌లో సభ్యులుగా నమోదు చేసుకోవాలని అపర్ణ కోరారు.తన ఎంపికకు సహకరించిన డి వై ఓ సంజీవ్ అకౌంటెంట్ దేవీలాల్ ,కుమార్, పవన్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.యువ వాలంటీర్‌గా ఎంపికైన కళ్లబోయిన అపర్ణ గ్రామస్తులు, యువత మరియు పలువురు అభినందించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
