BRS on Congress 33 Months Rule
ఆకేరు న్యూస్,ములుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 33 నెలలు గడుస్తున్నా, ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, 14 డిక్లరేషన్లను విస్మరించి ప్రజలను ఘోరంగా మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాపులమర్రి లక్ష్మణ్ బాబు ధ్వజమెత్తారు. పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, హరీష్ రావుల పిలుపు మేరకు కాంగ్రెస్ అసమర్థ పాలనను ఎండగడుతూ ఏడు రోజుల నిరసన కార్యక్రమంలో భాగంగా మంగళవారం విలేకరుల సమావేశంలో ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి మాట్లాడుతూ,కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో ప్రతి మహిళకు నెలకు రూ. 2,500 ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. తులం బంగారం హామీని నీరుగార్చారు. ఉచిత బస్సు పేరుతో వరంగల్, ములుగు, ఏటూరునాగారం, భద్రాచలం రూట్లలో బస్సులు తగ్గించి చార్జీలు పెంచి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. రైతుబంధు కాంగ్రెస్ ఎకరాకు రూ. 15,000 ఇస్తామని ఎగ్గొట్టిందని,. రైతు భరోసా, రుణమాఫీ, కౌలు రైతులకు రూ. 12,000 హామీలు నెరవేర్చలేదన్నారు.ములుగు ఏరియా ఆసుపత్రిలో ఏటూరునాగారంలో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉందని,ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్, బస్ డిపో, కరకట్ట నిర్మాణం, దేవాదుల పంప్ హౌస్ ద్వారా చెరువులు నింపే ప్రక్రియను స్థానిక మంత్రి సీతక్క పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, జిల్లా నాయకులు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
