CPS Abolition Telangana Teachers
ఆకేరు న్యూస్, ములుగు: ఉద్యోగ ఉపాధ్యాయుల కాంట్రిబ్యూషన్ పెన్షన్ రద్దు చేయాలని
డిమాండు చేస్తూ తాడ్వాయి మండల కేంద్రంలో మంగళవారం వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉపాధ్యాయులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో అధికారులకు అందజేశారు . మొదట మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత ,ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులు సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ తో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు, మండల స్థాయి నాయకులతో ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు పోరిక శంకర్,రేగ నరేంద్ర కుమార్, సోలం కృష్ణయ్య, స్రవంత్, వనిత, వెంకన్న, గుమ్మడి ప్రభాకర్, కళ్యాణ్ ,తోలేం లక్ష్మయ్య ,సూతారి పాపారావు,అలెం భాస్కర్ లతో పాటు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
