DS Jagan Information Public Relations Department
* మంత్రి పొంగులేటి అభినందనలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: సమాచార, పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకుడిగా (Additional Director) డి.ఎస్. జగన్ పదోన్నతి పొందారు. ప్రభుత్వం పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం ఆయన అదనపు సంచాలకుడిగా బాధ్యతలు స్వీకరించారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం డి.ఎస్. జగన్ డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆయనకు పదోన్నతి సందర్భంగా అభినందనలు తెలిపారు.
* నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. డీఎస్ జగన్
ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరవేయడంతో పాటు ప్రభుత్వం, ప్రజలు, మీడియా మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని మంత్రి ఆకాంక్షించారు. అనంతరం డి.ఎస్. జగన్ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ డా. జి. ముకుందరెడ్డిని కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్పెషల్ కమిషనర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అదనపు సంచాలకుడిగా బాధ్యతలు స్వీకరించిన డి.ఎస్. జగన్ మాట్లాడుతూ, ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా విధులను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు విస్తృతంగా చేరవేయడంలో శాఖ అధికారులు, సిబ్బందితో సమన్వయంతో పనిచేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులు, సిబ్బంది డి.ఎస్. జగన్‌కు అభినందనలు తెలిపారు.
—————————-

Please tell us what is wrong. Your report will be sent to the website team.
