Minister Seethakka
* పేదల ఆర్థిక భారాన్ని తగ్గించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం
– రాష్ట్ర మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్,ములుగు: పేదల సామాజిక గౌరవానికి నూతన రేషన్ కార్డు ప్రతీకగా నిలుస్తుందని,పేద కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
మంగళవారం ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి మంత్రి ములుగు, మల్లంపల్లి మండలాల లబ్ధిదారులకు క్యూఆర్ కోడ్‌తో కూడిన నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ములుగు మండలానికి 1,809, మల్లంపల్లి మండలానికి 621 చొప్పున మొత్తం 2,430 నూతన రేషన్ కార్డులను అందజేశారు.
* ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ..
రేషన్ కార్డులు లేని కారణంగా అర్హులైన పేదలు సన్నబియ్యం పథకానికి దూరం కావద్దనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం నూతన కార్డులను మంజూరు చేస్తోందని తెలిపారు. ఈ సంవత్సరంలో 12,802 నూతన రేషన్ కార్డుల ద్వారా 36,405 మంది కుటుంబ సభ్యులకు సన్నబియ్యం పథకం ప్రయోజనాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 15 లక్షలకు పైగా నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసినట్లు వివరించారు. రేషన్ సరుకులు పొందడానికే కాకుండా వివిధ ధ్రువపత్రాల జారీ, ఆరోగ్యశ్రీల అవసరాలకు రేషన్ కార్డు ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, ములుగు మున్సిపాలిటీ చైర్పర్సన్ చింత నిప్పుల చంద్రకళ, డీసీఎస్ఓ ఫైజల్ హుస్సేని, డీఎం కృష్ణవేణి, తహసీల్దార్లు, నూతన రేషన్ కార్డుల లబ్ధిదారులు, రేషన్ డీలర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
