Raigarh Instagram Minor Case
* బాలికపై లైంగిక దాడి
* పెళ్లి పేరుతో వంచన
* ఏడాదికి పైగా అఘాయిత్యం
* బిహార్, ఒడిశా మీదుగా తీసుకెళ్లిన యువకుడు
ఆకేరు న్యూస్, రాయ్‌గఢ్:
సోషల్ మీడియాలో పరిచయాలు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో తెలియడం లేదు. ఆన్లైన్లో పరిచయాలు పెరిగి అవస్థలుగా మారుతున్నాయి. తెలిసీ తెలియని వయసులో యువత తప్పటడుగులు వేస్తున్నారు. తప్పుదారి పట్టొద్దని తల్లిదండ్రులు హెచ్చరించినా వారి మాటలు పట్టించుకోవడం లేదు. వారికి తోచిన దారిలో నడుస్తూ వెళ్తున్నారు. చిక్కుల్లో పడుతున్నారు. కొందరు మోసపోతే మరికొందరు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇంకొందరు ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు.
ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి 17 ఏళ్ల బాలికను ఇంటి నుంచి తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో వెలుగుచూసింది. బాలికను ఏడాదికి పైగా ఇంటికి దూరంగా ఉంచినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ కేసులో నిందితుడిగా గుర్తించిన దిలేశ్వర్ చౌహాన్‌ను పోలీసులు సరంగఢ్-బిలాయ్గఢ్ జిల్లాలో గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
* ఇన్స్టాగ్రామ్ పరిచయంతో..
పోలీసుల దర్యాప్తులో బాలికకు దిలేశ్వర్ చౌహాన్‌తో కొన్ని నెలలుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. 2025 జనవరి 25న కలుద్దామని యువకుడు బాలికను పిలిచినట్లు పోలీసులు తెలిపారు. ఆమె కెవ్దాబరి బస్‌స్టాండ్‌కు వెళ్లగా, పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తన వెంట తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
* బిహార్ నుంచి ఒడిశాకు..
బాలికను బస్సులో బిహార్‌లోని గయకు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ ఇటుక బట్టీలో పని చేస్తున్న బాలిక తల్లిదండ్రులు ఉన్న ప్రాంతంలో సుమారు ఆరు నుంచి ఏడు నెలల పాటు ఇద్దరూ ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ఒడిశాకు వెళ్లిన నిందితుడు అక్కడ కూలీగా పని చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలిక అతడితోనే ఉన్నట్లు వెల్లడించారు. అనంతరం ఇద్దరూ తిరిగి సరంగఢ్ ప్రాంతానికి వచ్చి నిందితుడి గ్రామంలో నివసించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
* పెళ్లి చేసుకుంటానని చెప్పి..
పెళ్లి చేసుకుంటానని హామీ ఇస్తూ నిందితుడు పలుమార్లు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలిక పోలీసులకు తెలిపినట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా బాలిక ఆచూకీని పోలీసులు గుర్తించి ఆమెను రక్షించారు. ఈ ఘటనలో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కోర్టు రిమాండ్‌కు పంపించింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
