Varanasi Mahesh Babu Bull Fight
ఆకేరు న్యూస్, హైదరాబాద్: టాలీవుడ్లో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన ‘వారణాసి’ పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ పాన్ వరల్డ్ మూవీ నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ట్రైలర్లో మహేష్ బాబు ఎద్దుపై కనిపించిన సన్నివేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. త్రిశూలం చేత పట్టుకుని ఎద్దుపై రుద్ర అవతారంలో మహేష్ కనిపించడం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.
* బుల్ ఫైట్.. మామూలుగా ఉండదు
సినిమాలో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్‌గా బుల్ ఫైట్‌ను మరింత భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు రాజమౌళి సిద్ధమవుతున్నట్లు తాజా సినీ సమాచారం. హైదరాబాద్ శివార్లలో ఈ సీక్వెన్స్‌కు సంబంధించిన షూటింగ్‌ను ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు కథనాలు చెబుతున్నాయి.రాజమౌళి సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కేవలం భారీ యాక్షన్ చూపించడమే కాకుండా.. ఆ సన్నివేశానికి కథ, భావోద్వేగాలను జోడించడం ఆయన శైలి. ‘వారణాసి’లోని బుల్ ఫైట్ కూడా అదే తరహాలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
* మహేష్ లుక్కు ఫిదా
వారణాసి నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రకు ‘రుద్ర’ అనే పేరు పెట్టినట్లు ఇప్పటికే వెల్లడైంది. శివుడితో అనుబంధం ఉన్న నంది ప్రతీకగా ఎద్దు సన్నివేశాన్ని సినిమాలో కీలకంగా చూపిస్తున్నారనే చర్చ కూడా సాగుతోంది.
ఎద్దుపై మహేష్ బాబు, చేతిలో త్రిశూలం, వెనుక భారీ యాక్షన్ నేపథ్యం.. ఈ కాంబినేషన్ తెరపై ఏ స్థాయిలో విజువల్ ట్రీట్ ఇవ్వబోతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
