Bigg Boss Telugu 10 Contestants
అకేరు న్యూస్, హైదరాబాద్ : బిగ్ బాస్ తెలుగు 10 సీజన్‌పై ఉత్కంఠ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతిష్టాత్మక 10వ సీజన్ గ్రాండ్ ప్రీమియర్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో ఆసక్తి తారస్థాయికి చేరింది. అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్‌గా ప్రేక్షకులను అలరించనున్నారు. ఆయన హోస్టింగ్‌లో మరోసారి ఈ పాపులర్ రియాలిటీ షో సందడి చేయనుంది. ఈ కొత్త సీజన్ 2026 సెప్టెంబర్ 6న గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం కలర్స్ తెలుగులో ప్రసారం కానుండగా, జియోస్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
* కంటెస్టెంట్లుగా పలువురి పేర్లు?
షో ప్రారంభానికి ముందే పలువురు సెలబ్రిటీల పేర్లు కంటెస్టెంట్లుగా వినిపిస్తున్నాయి. ఈ జాబితాలో యాంకర్ వర్ష, ‘ఎన్నెన్నో జన్మల బంధం’ ఫేమ్ దేవజాని, జబర్దస్త్ నరేష్, జబర్దస్త్ ఆటో రాంప్రసాద్, ‘గుప్పెడంత మనసు’ ఫేమ్ ముఖేష్ గౌడ, ‘ప్రేమ దేశం’లో నటించిన అతిథి ఈశ్వరన్ పేర్లు ఉన్నట్లు సమాచారం.
* డ్రామా, ఎంటర్టైన్మెంట్కు కొదవ ఉండదు
మరోవైపు ఒక సైటు తెలుగు కథనం ప్రకారం, టెంపర్ వంశీ, వర్షిణి సౌందరరాజన్, చైత్ర రాయ్, కృష్ణుడు, ఆదిత్ ఈశ్వరన్ పేర్లు కూడా కంటెస్టెంట్ల జాబితాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ వార్తలు నిజమైతే నటులు, యాంకర్లు, కమెడియన్లు, ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటీలతో ఈ సీజన్ మరింత వైవిధ్యంగా ఉండే అవకాశం ఉంది. అందరూ ఒకే ఇంట్లో కలిసి ఉండటంతో డ్రామా, ఎంటర్టైన్మెంట్కు కొదవ ఉండదనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
