Happy Journey Movie Release Date
* సెప్టెంబర్ 18న థియేటర్లలోకి
* ట్రావెల్ థీమ్‌తో ఆసక్తికరంగా సినిమా
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
ఏడు మంది మహిళల జీవితాల చుట్టూ సాగే కథాంశంతో తెరకెక్కుతున్న ‘హ్యాపీ జర్నీ’ సినిమా విడుదలకు సిద్ధమైంది. గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదల కానుంది.
* మహిళల ప్రయాణమే కథ
అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పృథ్వీ దండమూడి, వంశీ, రవి శివ తేజ పైల కీలక సహాయ పాత్రలు పోషించారు. ఈ చిత్రంతో అభిరామ్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తరుణ్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మహిళా పాత్రల జీవితాల్లో జరిగే పరిణామాలతో పాటు, వారి ప్రయాణం ఎలాంటి మార్పులకు దారితీస్తుందనే అంశాలను కథలో చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన హార్ట్‌వార్మింగ్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్లో ప్రధాన తారాగణం అంతా విమానాశ్రయం బ్యాక్‌డ్రాప్‌లో సందడిగా కనిపిస్తోంది.
ట్రావెల్ బ్యాగులు, విమానం, పేపర్ ప్లేన్ మోటిఫ్ సినిమాలోని ట్రావెల్ థీమ్‌ను హైలైట్ చేస్తున్నాయి. ఈ ప్రయాణం కేవలం గమ్యస్థానానికి చేరుకోవడమే కాకుండా.. పాత్రల జీవితాలపై చెరగని ప్రభావాన్ని చూపించబోతుందనే ఆసక్తిని పోస్టర్ కలిగిస్తోంది.
* ప్రమోషన్స్ ముమ్మరం
విడుదల తేదీ ఖరారు కావడంతో మేకర్స్ ప్రమోషన్స్‌ను మరింత ముమ్మరం చేయనున్నారు. సినిమాపై బజ్‌ను పెంచేందుకు వరుసగా ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. సాంకేతికంగా కూడా ఆసక్తికరమైన టీమ్ ఈ చిత్రానికి పనిచేస్తోంది. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా, మణికందన్ సుబ్రమణియన్ సినిమాటోగ్రఫీ, చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సెప్టెంబర్ 18న ‘హ్యాపీ జర్నీ’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
